జనం కోసం జనసేన పాదయాత్రకు అనూహ్య స్పందన..

జనం కోసం జనసేన పేరుతో జనసేన పార్టీని గ్రామ స్థాయికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం సిద్దాంతాలను ప్రజలకు తెలియజేయడానికి తలపెట్టిన పాదయాత్ర 75 రోజులు పూర్తి అయిన సందర్భంగా పాదయాత్ర విశేషాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వాలు మారిన ప్రజల ఇక్కట్లు మారడం లేదని, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పాలకులు పట్టించుకోవడం లేదనే విషయం పాదయాత్ర ద్వారా స్పష్టంగా తెలుసుకున్నామని వివరించారు. నేటికి సరైన రహదారి లేని గ్రామీణ ప్రజలు ‌ప్రాణపాయ స్థితిలో దేవునిపై భారం వేసి మదనపల్లెకు చేరాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ‌అభివృద్ది, సౌకర్యాలు, ప్రజా సంక్షేమ పధకాలు రహదారులకు ఇరువైపులా తప్ప గ్రామాలకు చేరడం లేదని భాధను వ్యక్తం చేశారు. మే 25 న మదనపల్లె రూరల్ మండలం కాశీరావుపేటలో ప్రారంభమైన పాదయాత్ర కొత్తవారిపల్లి, పోతబోలు, సిటిఎం, సిటిఎం క్రాస్ రోడ్డు, దుబ్బిగానిపల్లి పంచాయతీలలో చేపట్టడం జరిగిందన్నారు.

ముఖ్యంగా వితంతువులకు, వికలాంగులలకు, నిరుపేదలకు ప్రభుత్వం అందించే పించను అందక పోవడం దురదృష్టకరం అన్నారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వ్వవస్థ వున్న అర్హులైన వారికి అందే ప్రభుత్వ సాయం అంతంతమాత్రమే అన్నారు.‌ ఉపాధి అవకాశాలు లేక వలస పొయిన వారి కుటుంబాలలో వున్న వృద్దులు, చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఇంటింటికీ తిరుగుతూ జనసేన పార్టీ సిద్దాంతాలను వివరించడం, రాష్ట్రంలో వైసిపి పాలనలో ధరల పెరుగుదల, దౌర్జన్యాలను మహిళలకు వివరిస్తూ ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన జనసేన పార్టీకి ఓట్లు వేయాలని‌ కోరుతున్నారు. పాదయత్ర అడుగడుగునా జనసేన పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున బాణసంచా కాల్చుతూ మైఫోర్స్ మహేష్ కు స్వాగతం పలికి ఆహ్వానించడం జరుగుతోంది. జనసేన పార్టీ నుండి ఇంటింటా తిరిగి సమస్యలు తెలుసుకోవడం, గ్రామాలలో ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించడం, జనసేనాని పవన్ కళ్యాణ్ షణ్ముఖ విధానం ప్రజలకు చేరవేయడం, తద్వారా ప్రజలకు కలిగే మంచిని వివరించడం ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఎప్పుడూ ఎన్నికలు జరిగినా జనసేన పార్టీ గెలుపు కోసం ఇప్పటి నుండే ప్రజలలోకి వెళ్లడానికి సిద్దమైన విధానాన్ని జనసేన అభిమానులు సంతోషంగా ఉందని, ప్రజలలోకి వెళ్ళిడం మంచే జరుగుతుందని భావిస్తున్నారు. ప్రజా శ్రేయస్సు కోరే ప్రజల మనిషి పవన్ కళ్యాణ్ అని, ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు సైతం నమ్ముతున్నారని అభిమానులు సంతృప్తి వ్వక్తం చేస్తున్నారు.

మదనపల్లె నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ఇంటింటా తిరిగి జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ సిద్దంతాలు, గాజు గ్లాసు గుర్తు విస్తృతంగా ప్రచారం చేయడంపై జనసేన పార్టీ అభిమానులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ చేసిన తప్పిదంగా అభివర్ణించారు. ‌ప్రశాంతమైన వాతావరణం, ఉద్దండులకు నెలవు మదనపల్లె అన్నారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేసే సమయంలో ప్రభుత్వం సరైన విధంగా స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.‌ అన్ని హంగులు వున్న మదనపల్లెను జిల్లా కేంద్రం చేయకుండా రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బ తీయడమే అన్నారు. ‌ఇక్కడి ప్రజ ఆకాంక్షలను గౌరవించకుండా రాయచోటిని జిల్లా చేయడంపై ప్రజలు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన ముందుకెళ్ళడం ఇక్కడి ప్రజలను అవమాన పరచడమే అన్నారు.‌ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ మదనపల్లె కేంద్రంగా జనగనమన జిల్లా సాధించడానికి పోరాటం సాగిస్తానని వెల్లడించారు.‌ విద్యావేత్త అనిబిసెంట్ నడయాడిన నేలపై రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన రచించి, తొలిసారి పాడిన బిటి కళాశాల సాక్షిగా మదనపల్లె జిల్లాపై నేటి పాలకులకు చిత్తశుద్ధి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనిబిసెంట్, రవీంద్రనాథ్ ఠాగూర్ లను స్మారిస్తూ ప్రపంచ వ్వాప్తంగా మదనపల్లెకు గుర్తింపు తెచ్చిన జనగణమన కు ఊపిరి పోసుకున్నా బిటి కళాశాల సాక్షిగా మదనపల్లెకు జనగణమన జిల్లా చేసే వరకు పోరాటం సాగిస్తామని ఆత్మవిశ్వాసం వ్వక్తం చేశారు. మదనపల్లె జిల్లా జనగణమన జిల్లా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చేయని పక్షంలో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి వెంటానే మదనపల్లె కేంద్రంగా జనగణమన జిల్లా చేస్తామని దీమా వ్వక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.