అపరిచితమైన వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్ పై అప్రమత్తంగా ఉండండి.

నంద్యాల జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి
నంద్యాల:జిల్లా ఎస్పీ  కె.రఘువీర్ రెడ్డి సైబర్ నేరాల పట్ల , సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమతంగా ఉండాలని హెచ్చరించారు.. సైబర్ నేరగాళ్ల ప్రజలను ఎలా  మోసం చేస్తున్నారని ప్రజలకు తెలియజేస్తూ అప్రమతంగా ఉండాలని తెలియజేశారు. ప్రస్తుతం  టెక్నాలజీ(Technology) అరచేతిలోకి రావడంతో ఆన్‌లైన్ కార్యకలపాలు విపరీతంగా పెరిగిపోయాయి. అదే స్థాయిలో సైబర్ నేరాల సంఖ్య అధికమవుతూ వస్తోంది. సైబర్ నేరగాళ్లు కొన్ని పద్ధతులను ఉపయోగించి యూజర్లను మోసం చేస్తున్నారు.

వీడియో కాల్ ఫ్రాడ్, సోషల్ మీడియా యప్ ల ద్వారా అందమైన యువతుల ఫోటోలు,పేర్లతో ప్రొఫైల్ క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియా ఖాతాలో ఉంచడం ద్వారా పలువురిని ట్రాప్ చేసి  పరిచయం పెంచుకుంటారు.అనంతరం వీడియో కాల్ చేసి తద్వారా ఆ వీడియో కాల్ రికార్డింగ్స్ మరియు స్క్రీన్ షాట్ ఫొటోస్ ని మీకు పంపించి వినియోగదారులకు వల వేసి అందినకాడికి దోచుకుంటున్నారు. సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి? వీటి నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరు జాగ్రతలు తీసుకోవాలలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.