అనుమానం పెనుభూతం భార్యను కిరాతకంగా హతమార్చిన భర్త
నంద్యాల:నంద్యాల జిల్లా యనకండ్ల లో దారుణం జరిగింది. అనుమానం తో భార్యను విచక్షణ రహితంగా గొడ్డలితో తలపై నరికి భర్త నాగ ప్రసాద్ హతమార్చాడు. కుటుంబ కలహాల కారణంగా అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది నాగప్రసాద్ మాదవికి దంపతులకు కుమారుడు కుమార్తె సంతానం ఆరు సంవత్సరాల క్రితం నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామానికి ఇచ్చి వివాహం చేశారు నాగప్రసాద్ తరచుగా జులాయిగా తిరుగుతూ బానిస అలవాట్లకు పడ్డాడు.
రెండు సంవత్సరాల క్రితం అత్త గారు ఊరు బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామానికి వచ్చిన నాగ ప్రసాద్ రాత్రి యధావిధిగా గొడవపడి విచక్షణ రహితంగా బార్య మాదవిని గొడ్డలితో తలపై నరికి హత్య చేసాడు. మృతదేహానికి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. నిందితుడు నాగప్రసాద్ పరారీలో వున్నాడు. బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు