డిసెంబరు 16న వస్తున్న అవతార్-2… లేటెస్ట్ ట్రైలర్ ఇదిగో!

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం అవతార్ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించింది. ఇందులో చూపించిన పండోరా ప్రపంచం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. ఇప్పుడీ చిత్రానికి జేమ్స్ కామెరాన్ పలు సీక్వెల్స్ తీస్తున్నారు.

ఈ క్రమంలో అవతార్-2 షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. డిసెంబరు 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం తాజాగా 3డీ ట్రైలర్ ను పంచుకుంది. అవతార్: ది వే ఆఫ్ వాటర్ పేరిట రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రంలో శామ్ వర్దింగ్టన్, జో సల్దానా, కేట్ విన్ స్లెట్ తదితరులు నటించారు. అవతార్ సీక్వెల్ ను దాదాపు రూ.2 వేల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అంతకుముందు అవతార్ చిత్రాన్ని రూ.1,961 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా, రూ.24 వేల కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు అవతార్-2 ఆ రికార్డును బద్దలు కొడుతుందా? లేదా? అన్నది ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.