అయితే డాన్సులు చిరంజీవికి ఇచ్చి, ఫైట్లు నాకు ఇవ్వాల్సిందే!: చిరంజీవి కాంబోలో సినిమాపై బాలకృష్ణ

‘ఆహా’ ఫ్లాట్ ఫామ్ పై ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ మొదలైంది. బాలకృష్ణ ఈ టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ టాక్ షోకి అగ్ర నిర్మాతలైన అల్లు అరవింద్ .. సురేశ్ బాబు హాజరయ్యారు. అలాగే అగ్రదర్శకులైన రాఘవేంద్రరావు – కోదండరామి రెడ్డి కూడా పాల్గొన్నారు. ముందుగా బాలయ్య  వేదికపైకి అల్లు అరవింద్ ను .. సురేశ్ బాబును ఆహ్వానించారు.

తాను చాలా సూటిగా ప్రశ్నలు అడుగుతాననీ .. ఆ ప్రశ్నలకు తానే బాధ్యుడిననీ, ఆ ప్రశ్నలతో అల్లు అరవింద్ కి ఎలాంటి సంబంధం లేదనీ, ఆయన అడగమని చెప్పలేదని ముందుగానే సురేశ్ బాబుతో బాలకృష్ణ చెప్పడం విశేషం. అందుకు సురేశ్ బాబు కూడా నవ్వుతూ, సమాధానాలు చెప్పడానికి తాను సిద్ధంగానే ఉన్నానని అన్నారు.

సురేశ్ ప్రొడక్షన్స్ తో తన తండ్రకీ .. తనకి చాలా అనుబంధం ఉందనీ, మరి గీతా ఆర్ట్స్ లో తన సినిమా మాటేమిటి అన్నట్టుగా అల్లు అరవింద్ తో బాలయ్య అన్నారు. “చిరంజీవి – బాలకృష్ణల కాంబినేషన్లో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను” అని అల్లు అరవింద్ చెప్పారు. “అయితే డాన్సులు చిరంజీవికి ఇచ్చి, ఫైట్లు తనకి ఇవ్వాల్సిందే” అంటూ బాలయ్య నవ్వేశారు.

Leave A Reply

Your email address will not be published.