పొద్దున్నే ఫ్యాటీ ఫుడ్స్ ఎందుకు తీసుకోవాలో తెలుసా?

ఉదయం అల్పాహారానికి (బ్రేక్ ఫాస్ట్/రోజులో మొదటి ఆహారం) ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. తమకు నచ్చిన టిఫిన్ తినే వారు ఎక్కువ మంది అయితే, కొందరు ఉదయం కూడా అన్నం తీసుకుంటారు. కానీ, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ తో కూడుకున్నవి. వీటికి బదులు ఉదయం ఫ్యాట్ తో కూడిన పదార్థాలు తినడం ఎంతో మంచిదన్నది పోషకాహార నిపుణుల సూచన.

ఉదయం తీసుకునే ఆహారమే రోజులో మిగిలిన సమయం మనం ఎలా ఉంటామన్నది నిర్ణయిస్తుంది. ఉదయం కాఫీతో (చక్కెర వేసిన) రోజును ఆరంభించే వారు ఎందరో ఉన్నారు. ఇలా ఉదయం కార్బోహైడ్రేట్స్ ను మన శరీరంలోకి భారీగా పంపించేస్తే.. మధ్యాహ్నం అవ్వకుండానే బాగా ఆకలివేస్తుంది. ఈ ఆకలి తట్టుకోలేక కొందరు కనిపించినది ఏదో ఒకటి తింటుంటారు. దీంతో కార్బోహైడ్రేట్స్ మరింత పెరిగి, చివరికి మన ఆరోగ్యానికి హాని జరుగుతుంది.

ఉదయం తీసుకునే ఆహారం పోషకాలతో, పీచుతో ఉండాలన్నది నిపుణుల సూచన. బ్లడ్ షుగర్ పెరిగిపోకుండా, నియంత్రణలోనే ఉండాలంటే ఫ్యాట్ కు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఉదయం కాఫీ అలవాటున్నవారు, కెఫీన్ తీసేసిన కాఫీనే తాగాలి. ముఖ్యంగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, తీవ్ర మలబద్ధకం ఉన్న వారు డీకాప్ కాఫీయే తీసుకోవాలి.
పీరియడ్స్ క్రమం తప్పి వస్తున్న మహిళలు ఫ్యాట్ తో కూడిన ఆహారాన్నే ఉదయం తీసుకోవాలి. ఫ్యాట్ కలిసిన కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్ సమ్మేళన పదార్థాలను సైతం తీసుకోవచ్చు. అలాగే, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అందేలా చూసుకోవాలి. అప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ గా మారతాయి.
ఉదయం కార్బోహైడ్రేట్స్ కు బదులు ఫ్యాట్ తీసుకోవడం వల్ల మగత పోతుంది. శక్తి స్థిరంగా ఉంటుంది. దీనివల్ల మన ఉత్పాదకత కూడా పెరుగుతుంది. శరీరం ఉత్పత్తి చేసే కార్టిసాల్ మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు.
ఉదయం నిద్రలేస్తూనే తెగ ఆకలి వేస్తుంటే.. ప్రోటీన్, పీచు, ఫ్యాట్ ఉన్నవే తినాలి. దీనివల్ల బ్లడ్ గ్లూకోజ్ స్థిరంగా ఉంటుంది.
fats, fat food, seating, break fast, morning best foods

Leave A Reply

Your email address will not be published.