అట్టహాసంగా మొదలైన కామన్వెల్త్ గేమ్స్..
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలు మొదలయ్యాయి. బర్మింగ్హామ్ వేదికగా గురువారం రాత్రి ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలుగు తేజం పీవీ సింధు, భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ త్రివర్ణ పతాకంతో భారత జట్టును ముందుండి నడిపించింది. శుక్రవారం నుంచి పోటీలు జరుగుతాయి. తొలి రోజు భారత క్రీడాకారులు వివిధ క్రీడల్లో పోటీ పడున్నారు. మహిళల క్రికెట్, హాకీ, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ క్రీడల్లో భారత జట్లు తలపడుతాయి. వీటితో పాటు ఇతర క్రీడల్లో పోటీపడే భారత క్రీడాకారుల వివరాలు.. పోటీల సమయాలు ఇలా ఉన్నాయి.
. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా పాకిస్తాన్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 నుంచి జరుగుతుంది
. మహిళల టి20 క్రికెట్‌లో భాగంగా తొలి మ్యాచ్ లో భారత్ బలమైన ఆస్ట్రేలియాతో తలడపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30కు మొదలవుతుంది.
. పురుషుల బాక్సింగ్ తొలి రౌండ్ లో శివ థాపా పాకిస్తాన్ కు చెందిన సులేమాన్ తో పోటీ పడుతాడు. ఈ బౌట్ సాయంత్రం 4:30 నుంచి జరుగుతుంది.
. మహిళల హాకీ లీగ్ మ్యాచ్‌లో భాగంగా భారత జట్టు ఘనాతో పోటీ పడుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 6:30కు మొదలవుతుంది.
. టేబుల్ టెన్నిస్ టీమ్ లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా మహిళల జట్టు దక్షిణాఫ్రికా, ఫిజీతో తలపడనుంది. (మధ్యాహ్నం గం. 2 నుంచి);
పురుషుల జట్టు బార్బడోస్, సింగపూర్ జట్లను ఎదుర్కొంటుంది. సాయంత్రం 4:30 నుంచి ఈ మ్యాచ్ లు జరుగుతాయి.
. భారత క్రీడాకారులు పోటీ పడే ఈవెంట్లు సోనీ నెట్ వర్క్ తో పాటు సోనీలివ్ ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.