మునుగోడు ఉప ఎన్నిక క‌మిటీని ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌

కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా ప్ర‌క‌టిస్తూ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ప్ర‌కట‌న చేసిన నిమిషాల వ్య‌వ‌ధిలో ఆ పార్టీ వేగంగా స్పందించింది. రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా నేప‌థ్యంలో మునుగోడుకు జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌కు సంబంధించి పార్టీ క‌మిటీని కాంగ్రెస్ పార్టీ మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌క‌టించింది. రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తున్న స‌మ‌యంలోనే ఆ పార్టీ ఉప ఎన్నిక‌ల క‌మిటీని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

మునుగోడు ఉప ఎన్నిక‌కు సంబంధించి స్ట్రాట‌జీ, ప్ర‌చార క‌మిటీకి మాజీ ఎంపీ మ‌ధు యాష్కీ గౌడ్ నేతృత్వం వ‌హించ‌నున్నారు. ఈ క‌మిటీలో దామోద‌ర్ రెడ్డి, బ‌ల‌రాం నాయ‌క్‌, సీత‌క్క‌, అంజన్ కుమార్ యాద‌వ్‌, అనిల్, సంప‌త్‌లు స‌భ్యులుగా వ్య‌వహ‌రించ‌నున్నారు. మునుగోడు ఉప ఎన్నిక‌కు సంబంధించి ఈ క‌మిటీనే అన్ని నిర్ణ‌యాల‌ను తీసుకోనున్న‌ట్లు స‌మాచారం.
Telangana, TPCC, Munugodu Bypoll,Congress, Madhu Yaskhi, Munugodu Bypoll Committee

Leave A Reply

Your email address will not be published.