కాకుమాను జ్యోతి కి  బంగారు నంది అవార్డు

హైదరాబాద్ ఏప్రిల్ 17: హేల్ టాటా మణి చారిటబుల్ ట్రస్టు ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ వ్యవస్థాపక చైర్మన్ కాకుమాను జ్యోతికి బంగారు నంది అవార్డు వరించింది.రంగా రెడ్డి జిల్లా ఉప్పరపల్లి  కేంద్రంగా మానవ సేవే మాదవ సేవ అని ,సేవా దృక్పథంతో పేద ప్రజల కోసం అనీక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ తనకంటూ గుర్తింపు పొందారు. కాకుమాను జ్యోతి సేవా కార్యక్రమాలను గుర్తించిన వేలూరి ఫౌండేషన్ సంస్థ సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ లో  నిర్వహించిన ఉగాది పురస్కారాలలో నందమూరి లక్ష్మీపార్వతి చేతులమీదుగా జ్యోతి కి  బంగారు నంది అవార్డును ప్రసంశా పత్రాన్ని అందజేసింది.ఈ సందర్బంగా కాకుమాను జ్యోతి మాట్లాడుతూ చేసే ప్రతి పని ప్రశాంత జీవనం గడుపడానికి దోహద పడుతుందని హేల్ టాటా మణి చారి టబుల్ సభ్యుల సభ్యుల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నారు.

పేదలకు సాయం చేయడంలో ఉన్న సంతృప్తి మరెందు లోనూ లేదని అన్నారు. తాను తన మిత్రులు శ్రేయోభిలాషుల సహకారంతో తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా సేవలు చేస్తున్నామని, పేదల ఆకలి తీర్చడం తమ బాధ్యతగా పలు కార్యక్రమాలు నిర్వహించామని జ్యోతి వెల్లడించారు. మహిళలలో ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు పలు సదస్సులను నిర్వహించి, ఆర్థిక స్వేచ్ఛ కల్పించే దిశగా వారిని ప్రోత్సహిస్తున్నామని ఆమె ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు జ్యోస్న, జగదాంబ , తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.