స్ట్రాంగ్ రూమ్ తాళాలను పగల గొట్టాలని హైకోర్టు ఆదేశాలు

జగిత్యాల,:వి.ఆర్.కె.కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్ తాళాలు పోయిన నేపథ్యంలో ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్మన్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవలే హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమిషన్ ప్రత్యేక అధికారి జేఎన్టీయూ లో  తాళాలు మిస్సింగ్ విషయంలో విచారణ చేపట్టి హైకోర్టుకు నివేదించారు.

ఈ క్రమంలో ఈ నెల 23 (ఆదివారం) నాడు ఉదయం 11 గంటలకు స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టి అందులోని సంబంధిత పత్రాలను హైకోర్టుకు అందజేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.