హయత్ నగర్ లో గల సాయినగర్ గ్రామ పంచాయతీలో గల సత్యశ్రీ జ్ఞాన సాయి పాదుకా మందిరంలో ఘనంగా గురుపౌర్ణమి‌ వేడుకలు

రంగారెడ్డి జిల్లా, వెలుతురు దినపత్రిక: గురుపౌర్ణమి మహోత్సవం హయత్ నగర్ లో గల సాయినగర్ గ్రామ పంచాయతీ లో గల సత్యశ్రీ జ్ఞాన సాయి పాదుకా మందిరం గురుపౌర్ణమి వేడుకలు డా భరత్ గురూజీచే ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబావారీ పాదుకలకు విశేష పూజ కార్యక్రమాలు జ్ఞాన సాయి పాదుకా మందిరములో గురు పాదుకా పూజ, పాదుకా అలంకరణ ఉదయం మరియు అన్న ప్రసాద వితరణ సాయంత్రం సంధ్యా హారతి సాయి భజన రాత్రి సెజా హారతి నిర్వహించారు మరియు పాదుకా మందిర కండువా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమాలలో భక్తులు అందరూ పాలు పంచుకుని ఆ సద్గురుని కరుణ కటాక్షము స్వీకరించడం జరిగింది.
ఈ సందర్భంగా భరత్ గురూజీ మాట్లాడుతూ విశేష ఆదరణ అందించినందుకు భక్తులకు ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.