పాలమూరు లిఫ్ట్ పనుల్లో పెను విషాదం..

పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పనులు చేస్తున్న ఐదుగురు కూలీలు ప్రమాదవశాత్తు ఈ ఉదయం మృతి చెందారు. నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం రేగుమనగడ్డ వద్ద ఈ తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి ప్యాకేజీ-1లో పనులు చేస్తున్న కూలీలు పంప్‌హౌస్‌లోకి దిగుతున్న సమయంలో క్రేన్ వైరు ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో కూలీలు కిందపడి దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితులను బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు.

Leave A Reply

Your email address will not be published.